ఐసీసీ మహిళల ప్రపంచకప్‌ 2025లో భారత్‌ మహిళల జట్టు ఘన విజయం – పాకిస్థాన్‌పై 88 పరుగుల తేడాతో గెలుపు

ఐసీసీ మహిళల ప్రపంచకప్‌ 2025లో భారత్‌ మహిళల జట్టు పాకిస్థాన్‌పై 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్‌ టోర్నమెంట్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్‌ జట్టు 247 పరుగులకు ఆలౌటైంది. ఇందులో హర్లీన్‌ దియోల్‌ 46 పరుగులతో ఆకట్టుకోగా, రిచా ఘోష్‌ 20 బంతుల్లో 35 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడింది. లక్ష్యాన్ని చేధించడంలో పాకిస్థాన్‌ జట్టు భారత బౌలర్ల అద్భుత బౌలింగ్ ముందు నిలువలేక 159 పరుగులకే ఆలౌటైంది. క్రాంతి గౌడ్‌ అద్భుత ప్రదర్శన కనబర్చుతూ కీలక వికెట్లు తీసి పాకిస్థాన్‌ చేజ్‌ను ఛిద్రము చేసింది. ఈ అద్భుత ప్రదర్శనకు గాను ఆమెకు “ప్లేయర్...