హిందూ సంఘటనే దేశ రక్షణకు మార్గం – ఆర్‌ఎస్‌ఎస్ విభాగ్ సంఘచాలక్ గార్లపాటి వెంకటయ్య

నల్లగొండ: హిందూ సంఘటనే దేశ రక్షణకు మార్గమని, హిందూ ఐక్యత సాధనకు పంచ పరివర్తన్ ద్వారా ఆర్‌ఎస్‌ఎస్ కృషి చేస్తున్నదని ఆర్‌ఎస్‌ఎస్ నల్లగొండ విభాగ్ సంఘచాలక్ గార్లపాటి వెంకటయ్య అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్దీ ఉత్సవాల భాగంగా, నల్లగొండ నగర శాఖ ఆధ్వర్యంలో మేకల అభినవ్ స్టేడియం నుండి నాగార్జున కళాశాల వరకు నగర ప్రధాన వీధుల గుండా పథ్ సంచలన్ (మార్చ్) నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ, 1925లో ప్రారంభమైన ఆర్‌ఎస్‌ఎస్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేల శాఖలతో విస్తరించి, ప్రపంచంలోని అనేక దేశాల్లో దేశభక్తి, హిందుత్వ విలువల ఆధారంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నదని తెలిపారు. హిందుత్వం జీవన విధానం, విశ్వశాంతికి ఆధారం అని పేర్కొంటూ, వివిధ...