జైలు జీవితం తర్వాత సమాజానికి సేవ చేయాలని ఖైదీలకు కలెక్టర్ సూచన
నల్గొండ: జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఖైదీలకు ప్రేరణాత్మక సూచనలు చేశారు. గాంధీ జయంతి సందర్భంగా గురువారం జిల్లా జైలులో నిర్వహించిన ఖైదీల సంక్షేమ దినోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో మహాత్మా గాంధీ అనేకసార్లు జైలుశిక్షను అనుభవించారని, సత్యాగ్రహం ద్వారా స్వాతంత్ర్యాన్ని సాధించిన గాంధీజీ కృషి గురించి పదిమందికి చాటి చెప్పాలని కోరారు. ఖైదీలు జైలు జీవితాన్ని ఒక అనుభవంగా, ప్రేరణగా తీసుకొని విడుదల తర్వాత సమాజంలో మళ్ళీ అడుగుపెట్టినప్పుడు ఇతరులకు సహాయం చేసే విధంగా మెలగాలని ఆమె పిలుపునిచ్చారు. జైలులో సమయాన్ని వృథా చేయకుండా లైబ్రరీలోని పుస్తకాలు చదివి ఆలోచన శక్తిని పెంపొందించుకోవాలని సూచించారు....