🏠 cheekativelugu.com
Watermark
Clip Header Logo
Date of Publish : 15 October 2026, 8:28 pm Posted by : CHEEKATI VELUGU

రత్నకిరీట ధగధగలు.. లలిత త్రిపుర సుందరీగా దుర్గామాత దర్శనం

News Image
కనగల్ మండలం దర్వేశిపురం గ్రామంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు దుర్గామాత అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. రంగురంగుల పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, రత్నకిరీటంతో అమ్మవారిని సుందరంగా అలంకరించారు. పుష్పమాలలు, వివిధ ఆయుధాలు, దైవిక చిహ్నాలతో అమ్మవారి అలంకరణ భక్తులను ఆకట్టుకుంది. ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భవాని మాలధారణ చేసిన భక్తులతో పాటు పలువురు భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి దివ్య అలంకరణను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో భవాని స్వాములు కప్పి పరమేష్, పిల్లుట్ల శివరామ్,విజయ్,శివాజీ,గణేష్, వెంకన్న తదితరులు ఉన్నారు.
🏠 Home