శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా ధర్వేశిపురం యల్లమ్మదేవి
శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు కనగల్ మండలం ధర్వేశిపురం (పర్వతగిరి)లోని శ్రీ యల్లమ్మ అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచార్య,చిలకమర్రి శ్రవణ్ కుమార్ ఆచార్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు.శ్రీ చక్ర అధిష్ఠాన శక్తిగా,పంచదశాక్షరీ మహామంత్ర దేవతగా కొలువైన అమ్మవారు చెరుకు గడను చేతబూని,ఇరువైపులా శ్రీ లక్ష్మీదేవి,శ్రీ సరస్వతీదేవిల సేవలందుకుంటున్న దివ్యరూపంలో దర్శనమిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ అంబటి నాగిరెడ్డి,అర్చకులు గాదె దామోదర్ రావు,గాదె ఉమామహేశ్వరరావు, సీహెచ్. అవ్యయ్ కుమార్,ఆలయ సిబ్బంది,అర్చకులు తదితరులు పాల్గొన్నారు.