ఉద్యమ నిరుద్యోగ కళాకారుల కన్నీటి దీక్ష సాంస్కృతిక సారథిలో ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు కల్పించాలి: కళాకారుల సంఘం డిమాండ్
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నిరుద్యోగ కళాకారులకు సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు పందిరి సైదన్న ఆధ్వర్యంలో గురువారం స్థానిక కలెక్టరేట్ ఎదుట శాంతియుత నిరాహార దీక్ష చేపట్టారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కళాకారులకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి, ఇప్పటివరకు అమలు చేయకపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కళాకారులు మాట్లాడుతూ.. ప్రజా పాలన ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిన మేనిఫెస్టోలో 96వ అంశంగా ఉద్యమ నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొందని గుర్తు చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చాలాకాలం గడుస్తున్నా హామీ అమలులో జాప్యం జరుగుతోందని, దీంతో అనేక మంది ఉద్యమ కళాకారులు ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ సమయంలో తమ ఆటపాటలతో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన కళాకారులను ప్రభుత్వం గుర్తించి న్యాయం చేయాలని కోరారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నకిరేకంటి కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. తమకంటే సీనియర్ కళాకారులను కోటి రూపాయల నజరానాతో గౌరవించడం సంతోషకరమని, అయితే ఉద్యమంలో పాల్గొన్న తమలాంటి నిరుద్యోగ కళాకారుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. ఉద్యమంలో కళాకారుల పాత్రను గుర్తించి, వారికి ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేరాల యాదగిరి మాట్లాడుతూ.. ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న కళాకారులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ దీక్షకు పలు ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కలకొండ శ్రీనివాస్, కోడి భీమ్ ప్రసాద్, కందుకూరి సుదర్శన్, వేముడాల శ్రీనివాస్, వనం లింగయ్య, నకిరేకంటి వేణు, మేదరి కిరణ్ కుమార్, వల్లంపట్ల అబ్రహం, కంచి శ్రీనివాస్, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు కోట వీరస్వామి, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు వేముల హరికృష్ణ, నిరసన మెట్ల పరమేష్, పొట్టేపాక అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఉద్యమ నిరుద్యోగ కళాకారులు పెద్ద సంఖ్యలో హాజరై దీక్షకు సంఘీభావం తెలిపారు.