🏠 cheekativelugu.com
Watermark
Clip Header Logo
Date of Publish : 15 October 2026, 3:40 pm Posted by : CHEEKATI VELUGU

పట్టభద్రుల ఓటరు నమోదుపై కంచర్ల భూపాల్ రెడ్డి సమీక్ష ఎన్రోలర్లు, నాయకులు ఇంటింటికీ తిరిగి ఓటరు నమోదు చేయించాలి: ఏనుగుల రాకేష్ రెడ్డి

News Image

నల్లగొండ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా నల్లగొండ నగరంలోని 1 నుంచి 25 వార్డులకు చెందిన ముఖ్య నాయకులు, కార్పొరేటర్లు, పోటీ చేసిన కార్పొరేటర్లు, ఓటరు నమోదు ఎన్రోలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి పాల్గొని ఇప్పటివరకు జరిగిన ఓటరు నమోదు ప్రక్రియను సమీక్షించారు.

ఈ సందర్భంగా కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి డివిజన్‌లోని నాయకులు, కార్పొరేటర్లు, ఎన్రోలర్లు ఇంటింటికీ తిరిగి ఉద్యోగులు, పట్టభద్రులను గుర్తించి ఓటర్లుగా నమోదు చేయించాలని సూచించారు. ఇప్పటికే నమోదు చేసుకున్న వారి వివరాలను కూడా సేకరించి, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చూడాలని కోరారు. ఓటరు నమోదు విషయంలో ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఓటరు నమోదు కోసం పర్యటిస్తున్నానని, ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. గతంలో పట్టభద్రుల ఓటరు నమోదు సరిగా జరగకపోవడం వల్ల పార్టీ ఓటమి పాలైందని పేర్కొంటూ, ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని అన్నారు. మూడు జిల్లాల్లోని 36 నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి పట్టభద్రుల ఓటరు నమోదు కీలకమని పేర్కొన్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లను, ఆర్థిక ప్రలోభాలను ఎదుర్కొని ఎన్నికల్లో విజయం సాధించేందుకు కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని కోరారు.

ఈ సమావేశంలో కార్పొరేటర్లు మారగోని భవాని గణేష్, పెరిక యాదయ్య, పేర్ల మల్లీశ్వరి అశోక్, రత్నగిరి తారకమ్మ శ్రీనివాస్, కుందూరు దీపికా ప్రవీణ్ రెడ్డి, బాణావత్ దీప్లా, దొడ్డి రమేష్, గోపగోని స్వాతి రాజశేఖర్‌తో పాటు పలువురు ముఖ్య నాయకులు, వివిధ డివిజన్లకు చెందిన ఎన్రోలర్లు పాల్గొన్నారు.
🏠 Home