🏠 cheekativelugu.com
Watermark
Clip Header Logo
Date of Publish : 14 October 2026, 7:15 pm Posted by : CHEEKATI VELUGU

ఘనంగా దుర్గామాత అభిషేకం ముఖ్య అతిథిగా పాల్గొన్న డా. నాగం వర్షిత్ రెడ్డి

News Image


నల్లగొండలో 37వ డివిజన్ కార్పొరేటర్ అఖిల్ రావు ఆధ్వర్యంలో హిందూ బంధువులు దుర్గామాత అభిషేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు డా. నాగం వర్షిత్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హిందూ బంధువులందరూ కులాలకు అతీతంగా ఐకమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో 39వ డివిజన్ కార్పొరేటర్ దాసరి సాయి యాదవ్, మాజీ కార్పొరేటర్ బొజ్జ నాగరాజు, రమేష్‌తో పాటు హిందూ బంధువులు పాల్గొన్నారు.
🏠 Home