🏠 cheekativelugu.com
Watermark
Clip Header Logo
Date of Publish : 12 October 2026, 8:19 pm Posted by : CHEEKATI VELUGU

నల్గొండలో రాయల్ శ్రీ మెగా హౌసింగ్ కాలనీ ప్రారంభం అయ్యింది.

News Image
అత్యాధునిక సౌకర్యాలతో ప్రారంభించిన ఈ నూతన వెంచర్‌ లో నేటి నుంచి ప్లాట్ల బుకింగ్ ప్రారంభం అయ్యాయి .
నిర్మాణ రంగంలో 29 సంవత్సరాల అపార అనుభవంతో, నాణ్యతకు ప్రాధాన్యమిస్తూ పలు హౌసింగ్ కాలనీలను విజయవంతంగా పూర్తి చేసిన రాయల్ రియల్ ఎస్టేట్ అండ్ బిల్డర్స్ సంస్థ మరో నూతన వెంచర్‌కు శ్రీకారం చుట్టింది. నల్గొండ పట్టణానికి సమీపంలోని మేళ్ల దుప్పలపల్లి రోడ్‌, జీవీ గూడెం ప్రాంతంలో అత్యాధునిక సౌకర్యాలతో ‘రాయల్ శ్రీ మెగా హౌసింగ్ కాలనీ’ని ఏర్పాటు చేసింది. ఈ వెంచర్‌లో ప్లాట్ల బుకింగ్‌ను ప్రారంభించారు .నిర్మాణ రంగంలో విశేష అనుభవం కలిగిన మహమ్మద్ బషీరుద్దీన్ ఆధ్వర్యంలో ఈ నూతన వెంచర్‌ను అభివృద్ధి చేస్తున్నారు. గతంలో భాగ్యనగర్, ధాత్రి నగర్, రాయల్ శుభోదయ హౌసింగ్ కాలనీ ఫేజ్‌-2, ఫేజ్‌-3, సాయి కృష్ణ హౌసింగ్ కాలనీ, రాయల్ సురభి హౌసింగ్ కాలనీలను విజయవంతంగా పూర్తి చేసిన అనుభవంతో రాయల్ శ్రీ మెగా హౌసింగ్ కాలనీని రూపొందించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.రాయల్ శ్రీ మెగా హౌసింగ్ కాలనీలో కొనుగోలుదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పలు మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఆర్‌ఈఆర్‌ఏ, డీటీసీపీ ఆమోదిత లేఅవుట్‌, 100 శాతం వాస్తు ప్రకారం ప్లాట్ల ఏర్పాటు, ఆకర్షణీయమైన ఎంట్రన్స్ ఆర్చ్‌, 60 అడుగులు, 30 అడుగుల వెడల్పుతో సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యం, పిల్లల కోసం ప్రత్యేక పార్క్‌, ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్‌, సాగర్ నీటి సరఫరా సదుపాయం ఈ వెంచర్‌లో ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. అంతేకాకుండా ప్లాట్ల కొనుగోలుదారులకు అన్ని బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం పొందే అవకాశం కల్పిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.దాదాపు మూడు దశాబ్దాల నిర్మాణ రంగ అనుభవంతో రాయల్ రియల్ ఎస్టేట్ అండ్ బిల్డర్స్ సంస్థ నూతన వెంచర్‌ను అందుబాటులోకి తీసుకురావడం విశేషం. గతంలో చేపట్టిన ప్రాజెక్టుల అనుభవాన్ని ఆధారంగా చేసుకుని, నల్గొండలో సొంత ఇంటి స్థలం కొనుగోలు చేయాలనుకునే వారికి అనువైన వసతులతో ఈ కాలనీని అభివృద్ధి చేస్తున్నట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు.రాయల్ శ్రీ మెగా హౌసింగ్ కాలనీ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ఆసక్తి గల కొనుగోలుదారులు మరిన్ని వివరాల కోసం రాయల్ రియల్ ఎస్టేట్ అండ్ బిల్డర్స్ మేనేజింగ్ పార్ట్‌నర్లు మహమ్మద్ బషీరుద్దీన్, అజీముద్దీన్‌లను సంప్రదించాలని సూచించారు తెలిపారు .
🏠 Home