జ్ఞానేశ్ కుమార్‌పై చర్యలు తీసుకోవడంలో కేంద్రం ఎందుకు వెనుకడుగు వేస్తోంది?*
*సామాన్య ప్రజల ఓటు హక్కును కాపాడాలి*
*పట్టణ శివాలయం లో మోడీకి కనువిప్పు కలగాలని పూజలు*
*బారి బైక్ ర్యాలీ ద్వారా నిరసన*
*ప్రధాన ఎన్నికల అధికారిపై చర్యలు తీసుకోవాలి,::*
*సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి*
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వ్యవహారశైలిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆయనపై చర్యలు తీసుకునే విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తోందని కాంగ్రెస్ పార్టీ నియోజవర్గ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి ప్రశ్నించారు.
సిరిసిల్ల నియోజకవర్గంలో దాదాపు 500 బైకులతో భారీ బైక్ నిరసన కార్యక్రమం నిర్వహించి, ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, ప్రజాస్వామ్య విలువలు, ప్రతి అర్హత కలిగిన పౌరుడి ఓటు హక్కును కాపాడాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, “ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై చర్యలు తీసుకునే విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు? ఆయనను ఎందుకు రక్షిస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి” అని ప్రశ్నించారు.
ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అనుమానాలు తలెత్తే పరిస్థితులు రావడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆయన అన్నారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు పూర్తి నమ్మకం ఉండేలా కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.
సామాన్య ప్రజల ఓటు హక్కును కాపాడటం ప్రతి ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క ప్రాథమిక బాధ్యత అని, అర్హత కలిగిన ఒక్క పౌరుడి ఓటు కూడా అన్యాయంగా తొలగిపోకూడదని కేకే మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా నిరసనకారులు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి, మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రాలు సమర్పించి, దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలు, ఓటు హక్కును కాపాడాలని కోరారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను, మహాత్మా గాంధీ చూపిన ప్రజాస్వామ్య మరియు న్యాయ మార్గాలను పాలకులు గౌరవించాలని వారు విజ్ఞప్తి చేశారు.
అనంతరం శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజాస్వామ్య పరిరక్షణకు పాలకులు ఇకనైనా తమ వైఖరిని మార్చుకోవాలని, ప్రజల మనోభావాలను గౌరవించాలని ప్రార్థించారు. “ప్రజల ఓటు విషయంలో ఇకనైనా కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల వ్యవస్థలు ప్రజల పక్షాన నిలబడాలి” అని కోరారు.
కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల ఓటు హక్కుపై అనుమానాలు కలిగించే పరిస్థితులు ఏర్పడితే అది కేవలం ఒక పార్టీకి సంబంధించిన సమస్య కాదని, దేశంలోని ప్రతి పౌరుడికి సంబంధించిన ప్రజాస్వామ్య సమస్య అని అన్నారు. “ఈరోజు ఒకరి ఓటు హక్కు ప్రశ్నార్థకమైతే, రేపు మరొకరి హక్కు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందుకే ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, ఓటు హక్కును కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున నిరంతరం పోరాడుతుంది” అని తెలిపారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు పూర్తి విశ్వాసం కలిగించేలా వ్యవహరించాలని, ఎన్నికల కమిషన్ పనితీరుపై తలెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
“ప్రజల ఓటు హక్కును కాపాడటమే మా లక్ష్యం. ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఉండాలి. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ఏ చర్యనైనా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. జ్ఞానేశ్ కుమార్ వ్యవహారంపై ప్రజల్లో తలెత్తుతున్న అనుమానాలకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలి” అని కేకే మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
*ఈ భారీ బైక్ నిరసన కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,సర్పంచ్ లు, కౌన్సిలర్స్, మార్కెట్ కమిటీ నాయకులు,కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు.*