విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని నిరంతరం కృషి చేయాలి
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలి
జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
సిరిసిల్ల: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు. సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన 100 రోజుల త్రివర్ణ పతాక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ప్రతి విద్యా సంవత్సరంలో 100 రోజుల పాటు జాతీయ జెండాను ఎగురవేసే కార్యక్రమం అభినందనీయమని ఎస్పీ పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భావం, దేశం పట్ల గౌరవం, బాధ్యతను పెంపొందిస్తాయని తెలిపారు.
అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. చదువుతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని అలవర్చుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ సమాజానికి ఉపయోగపడే బాధ్యతగల పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేసి వాటి నిర్మూలనకు సహకరించాలని కోరారు.
ప్రతి విద్యార్థి రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ సూచించారు. వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు. మైనర్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్, రాంగ్ రూట్లో ప్రయాణించడం చట్టరీత్యా నేరమని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కలిగి ఉండటంతో పాటు ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని సూచించారు.
అదేవిధంగా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాను జాగ్రత్తగా వినియోగించాలని తెలిపారు. వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. నకిలీ ఖాతాలు, ఫేక్ లింకులు, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, స్కాలర్షిప్లు, గిఫ్ట్ ఆఫర్లు, లక్కీ డ్రాల పేరుతో సైబర్ మోసాలు జరుగుతున్నాయని, విద్యార్థులు ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, ఎస్ఐ సాయి కిరణ్, కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ రఘునందన్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.