🏠 cheekativelugu.com
Watermark
Clip Header Logo
Date of Publish : 07 October 2026, 8:01 pm Posted by : CHEEKATI VELUGU

91.92 లక్షల మందికి ఎస్‌ఐఆర్‌ నోటీసులు

News Image
71.23 లక్షల మంది తుది జాబితాకు అర్హులు.. వెల్లడించిన ఎన్నికల సంఘంREPORTER KUKUTLA VARUN
తెలంగాణ ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా భారీ సంఖ్యలో ఓటర్లకు నోటీసులు జారీ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 91,92,625 మంది ఓటర్లకు ఎస్‌ఐఆర్‌ నోటీసులు అందజేసినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఓటర్ల వివరాల పరిశీలనలో భాగంగా జారీ చేసిన ఈ నోటీసులపై అర్హతకు సంబంధించిన ఆధారాలను సమర్పించే అవకాశం కల్పించారు..ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో ఇప్పటివరకు పరిశీలన పూర్తయిన వారిలో 71,23,526 మందిని తుది ఓటర్ల జాబితాలో చోటు కల్పించేందుకు అర్హులుగా నిర్ధారించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలు, చిరునామా మార్పులు, ఒకే వ్యక్తి పేర్లు ఒకటికి మించి నమోదవడం తదితర అంశాలను పరిశీలిస్తూ ఈ ప్రక్రియ కొనసాగుతోంది..రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన ప్రతి ఓటరుకు తుది జాబితాలో అవకాశం కల్పించేలా ఎన్నికల అధికారులు చర్యలు చేపడుతున్నారు. నోటీసులు అందుకున్న వారు తమ వద్ద ఉన్న సంబంధిత ధ్రువపత్రాలు, వివరాలను సమర్పించి తమ అర్హతను నిర్ధారించుకోవచ్చు. అభ్యంతరాలు, క్లెయిమ్‌లను నిబంధనల ప్రకారం పరిశీలించిన అనంతరం తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించనుంది..ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత రాష్ట్రంలో ఓటర్ల తుది సంఖ్యపై స్పష్టత రానుంది. అర్హత ఉన్న ఒక్క ఓటరు పేరు కూడా జాబితాలో లేకుండా పోకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపడుతున్నారు. అదే సమయంలో అనర్హులు, డూప్లికేట్‌ నమోదులు, ఇతర ప్రాంతాలకు మారిన వారి వివరాలను గుర్తించి ఓటర్ల జాబితాను మరింత పారదర్శకంగా రూపొందించేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది.
🏠 Home