🏠 cheekativelugu.com
Watermark
Clip Header Logo
Date of Publish : 07 October 2026, 5:20 pm Posted by : CHEEKATI VELUGU

పత్తి కొనుగోళ్లకు సర్వం సిద్ధం..

News Image
మద్దతు ధరకు పంట సేకరణకు పకడ్బందీ ఏర్పాట్లు5.93 లక్షల ఎకరాల్లో సాగు.. 3.56 లక్షల టన్నుల పత్తి మార్కెట్‌కు వచ్చే అవకాశంక్వింటాలుకు రూ.8,667 మద్దతు ధర.. 10 సీసీఐ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుREPORTER KUKUTLA VARUN
ఆదేశాల మేరకు 2026–27 పత్తి సీజన్‌లో ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు పత్తిని కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మార్కెటింగ్, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. పత్తి కొనుగోళ్ల సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, మార్కెట్‌కు వచ్చే పంటకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు..2026–27 పత్తి మద్దతు ధర సేకరణపై బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం, మార్కెట్‌కు వచ్చే పంట పరిమాణం, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, జిన్నింగ్‌ మిల్లుల అందుబాటు తదితర అంశాలపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలో సుమారు 5,93,795 ఎకరాల్లో పత్తి సాగు అవుతున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఈ సాగు విస్తీర్ణం నుంచి సుమారు 3,56,257 మెట్రిక్‌ టన్నుల పత్తి మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసినట్లు తెలిపారు.
భారీగా పత్తి మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా కొనుగోలు ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రైతులు తమ పంటను విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా తగిన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. పత్తి కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా మార్కెటింగ్‌, వ్యవసాయ శాఖల అధికారులు, సీసీఐ ప్రతినిధులు, జిన్నింగ్‌ మిల్లుల నిర్వాహకులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.జిల్లాలో పత్తి కొనుగోళ్ల కోసం 26 జిన్నింగ్‌ మిల్లులు ఉన్నాయని అధికారులు తెలిపారు. వీటితో పాటు కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఆధ్వర్యంలో 10 పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మార్కెట్‌కు పత్తి రాక ప్రారంభమయ్యే నాటికి కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తిచేసి సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. రైతులు పండించిన పంటను ప్రభుత్వ నిబంధనల మేరకు మద్దతు ధరకు విక్రయించుకునే అవకాశం కల్పించడంతో పాటు కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత పాటించాలని సూచించారు.కేంద్ర ప్రభుత్వం 2026–27 పత్తి సీజన్‌కు క్వింటాలుకు రూ.8,667 కనీస మద్దతు ధరను ప్రకటించింది. పత్తిలో తేమ శాతం 8 వరకు ఉంటే ప్రభుత్వం ప్రకటించిన పూర్తి మద్దతు ధర లభిస్తుందని అధికారులు తెలిపారు. రైతులు పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే సమయంలో నాణ్యత ప్రమాణాలు, తేమ శాతం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పత్తి కొనుగోళ్లు జరిగేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం, అంచనా దిగుబడి భారీగా ఉన్న నేపథ్యంలో కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా అధికారులు ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. రైతులకు మద్దతు ధర అందేలా, కొనుగోలు కేంద్రాల్లో రద్దీ సమస్యలు తలెత్తకుండా, మార్కెట్‌కు వచ్చే పత్తిని సకాలంలో సేకరించేలా అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
🏠 Home