పీహెచ్‌సీల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలి చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు పారిశుధ్య చర్యలు చేపట్టాలి: కలెక్టర్ బి.చంద్రశేఖర్
REPORTER KUKUTLA VARUN
వేములపల్లి: ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, ఆసుపత్రి పరిసరాల్లో చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు పారిశుధ్య చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం వేములపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఓపీ వివరాలు, రోగుల రిజిస్ట్రేషన్, డెంగ్యూ, పాము కాటు కేసులు, సిబ్బంది హాజరు, మందుల నిల్వలు, డ్రగ్స్ రిజిస్టర్ తదితర రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో ఎదురవుతున్న సమస్యలు, ప్రస్తుతం నమోదవుతున్న కేసుల వివరాలను వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు.ప్రస్తుతం జలుబు, దగ్గు తదితర సీజనల్ వ్యాధులకు సంబంధించిన కేసులు అధికంగా వస్తున్నట్లు వైద్యాధికారి కలెక్టర్‌కు వివరించారు. ఈ నేపథ్యంలో ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించడంతో పాటు వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. డెంగ్యూ వ్యాధి వ్యాప్తికి అవకాశం లేకుండా గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి దోమల నివారణకు అవసరమైన పారిశుధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ఆశా కార్యకర్తలతో కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. ప్రతి ఆశా కార్యకర్త తన డైరీలో ప్రజల ఆరోగ్య సమస్యలు, గర్భిణులు, ఇతర ముఖ్యమైన ఆరోగ్య వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఆదేశించారు. గర్భిణులకు అవసరమైన సమయంలో మెరుగైన వైద్యం అందేలా ముందస్తు అవగాహన కల్పించాలని, అత్యవసర పరిస్థితుల్లో వారిని ఏరియా ఆసుపత్రికి తరలించే విధంగా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.గ్రామాల్లో పారిశుధ్య పరిస్థితులను మెరుగుపర్చేందుకు గ్రామపంచాయతీ కార్యదర్శులతో సమన్వయం చేసుకుని ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని వైద్యాధికారిని కలెక్టర్ ఆదేశించారు. దోమల వృద్ధికి అవకాశం లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రజలకు కూడా వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు..ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున నీటిని పొదుపుగా వినియోగించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. నీటిని వృథా చేయకుండా అవసరమైన మేరకే వినియోగించేలా ప్రజలను చైతన్యపరచాలని సూచించారు. అదేవిధంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై ప్రజలకు, అర్హులైన బాలికలకు అవగాహన కల్పించి టీకా వేయించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు..పీహెచ్‌సీలోని వివిధ రిజిస్టర్లతో పాటు సిబ్బంది హాజరు వివరాలను పరిశీలించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలు గుర్తించిన వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని, ప్రజలకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యానికి తావులేకుండా విధులు నిర్వహించాలని సూచించారు..తహసిల్దార్ హేమలత, ఇన్‌చార్జి ఎంపీడీవో జ్యోతి, హాస్పిటల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ జి.సుచరిత, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఎన్.ప్రవీణ్, సూపర్‌వైజర్ శాంతమ్మ, రికార్డు అసిస్టెంట్ బి.సోములు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.