ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్
REPORTER KUKUTLA VARUN
మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం
మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిని లైంగిక వేధింపులకు గురి చేశారనే ఆరోపణలతో అరెస్టయిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డికి ఊరట లభించింది. ఈ కేసులో రెండు నెలలకు పైగా జైల్లో ఉన్న ఆయనకు ఉప్పరపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది..కేసు నమోదైన అనంతరం పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అప్పటి నుంచి ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. రెండు నెలలకు పైగా జైల్లో గడిపిన అనంతరం బెయిల్ కోసం ఆయన తరఫు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు..వాదనలు పరిశీలించిన ఉప్పరపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినట్లు సమాచారం. బెయిల్ సందర్భంగా కోర్టు విధించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో తదుపరి విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం పోలీసు వర్గాల్లో అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం నిందితుడికి బెయిల్ మంజూరు కావడంతో కేసు తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది. బెయిల్ మంజూరు కావడం కేసు నుంచి విముక్తి కాదని, ఆరోపణలపై తుది నిర్ణయం విచారణ అనంతరం కోర్టు పరిధిలోనే ఉంటుంది.