🏠 cheekativelugu.com
Watermark
Clip Header Logo
Date of Publish : 05 October 2026, 5:11 pm Posted by : CHEEKATI VELUGU

నకిలీ ఓటర్ దరఖాస్తులపై ఎన్నికల సంఘం సీరియస్ SIR–2026లో తప్పుడు వివరాలతో Form–7 దరఖాస్తులపై కఠిన చర్యలు.. విచారణకు ఈసీ ఆదేశాలు

News Image
తెలంగాణలో SIR–2026 ప్రక్రియ సందర్భంగా తప్పుడు వివరాలతో దాఖలైనట్లు గుర్తించిన ఓటర్ దరఖాస్తులపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా స్పందించింది. పెద్ద సంఖ్యలో Form–7 నకిలీ దరఖాస్తులు దాఖలైనట్లు గుర్తించిన ఎన్నికల సంఘం.. వాటిపై సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది...SIR–2026 ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితాకు సంబంధించి అందిన Form–7 దరఖాస్తులను పరిశీలిస్తున్న క్రమంలో పలు దరఖాస్తుల్లో తప్పుడు వివరాలు, అనుమానాస్పద సమాచారాన్ని గుర్తించినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇటువంటి దరఖాస్తులపై నిబంధనల ప్రకారం విచారణ జరిపి, తప్పు చేసినట్లు నిర్ధారణ అయితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.తప్పుడు సమాచారంతో ఓటర్ దరఖాస్తులు సమర్పించడం ఎన్నికల ప్రక్రియపై ప్రభావం చూపే అంశంగా ఎన్నికల సంఘం పరిగణించింది. అందువల్ల అనుమానాస్పదంగా ఉన్న Form–7 దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, వాటి వెనుక ఉన్న వ్యక్తులు, కారణాలు, దరఖాస్తుల్లో పేర్కొన్న వివరాల నిజానిజాలను నిర్ధారించాలని ఆదేశించింది..సెక్షన్ 31 కింద చర్యలు
తప్పుడు వివరాలతో దరఖాస్తులు సమర్పించినట్లు విచారణలో తేలితే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 31 కింద చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలో తప్పుడు సమాచారం సమర్పించడం లేదా నిబంధనలకు విరుద్ధంగా దరఖాస్తులు దాఖలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఈ ఆదేశాలతో స్పష్టమవుతోంది.
ఈ వ్యవహారంపై చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు (DEOs), ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (EROs), తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి (CEO), అలాగే రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం ఉత్తర్వుల కాపీలను పంపింది.
SIR–2026 ప్రక్రియలో ఓటర్ల జాబితా పరిశీలన, దరఖాస్తుల ధ్రువీకరణ అత్యంత కీలకమైన నేపథ్యంలో, నకిలీ లేదా తప్పుడు దరఖాస్తులను గుర్తించి వాటిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో తెలంగాణలో Form–7 దరఖాస్తుల పరిశీలన, వాటి వెనుక ఉన్న వివరాలపై అధికారులు చేపట్టే విచారణకు ప్రాధాన్యం ఏర్పడింది.
🏠 Home