మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు
మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్
చీకటి వెలుగు, నల్లగొండ:
గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి మొగుదాల పావని రమేష్ గౌడ్ అధ్యక్షతన మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రజలందరికీ గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి శుభాకాంక్షలు తెలిపారు. గాంధీజీ చూపిన అహింస, శాంతి మార్గాలు, లాల్ బహదూర్ శాస్త్రి పాటించిన నిజాయితీ, ఆయన ఇచ్చిన “జై జవాన్–జై కిసాన్” నినాదం దేశానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
మహనీయుల అడుగుజాడల్లో నడుస్తూ, వారి ఆదర్శాలను రోజువారీ జీవితంలో ఆచరించడమే వారికి అందించే నిజమైన నివాళి అని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోసిక వినయ్‌తో పాటు కౌన్సిలర్లు కొసనం రాజేష్ రెడ్డి, పోలేపల్లి లక్ష్మి ముత్తయ్య, పల్లె లావణ్య సురేందర్ రెడ్డి, బద్రి గాలయ్య, దేప రమ్య రాజు, పాక చిరంజీవి, ఉడుగు జ్యోతి రమేష్, బత్తుల జయమ్మ దాసు, చింతల ఉమామహేశ్వరి సాయిలు, బుడ్డా సురేష్, పిల్లలమర్రి మధుసూధన్, హన్ను మహమ్మద్ పాల్గొన్నారు.
అలాగే కో-ఆప్షన్ సభ్యులు పస్తం గంగరాములు, మహమ్మద్ బాబా షరీఫ్, షేక్ నబీబి జానీ బాబా, పలువురు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ పర్యావరణ ఇంజనీర్ రేణుకుమార్, కంప్యూటర్ ఆపరేటర్లు శ్రీకాంత్, భరత్, బిల్ కలెక్టర్లు బుచ్చి రాములు, ఉపేందర్, రవి, శ్యామ్, ఇన్‌వార్డ్ సిబ్బంది సునీత, భాస్కర్, అరవింద్, జవాన్ అంజయ్య, వంశీ తదితర కార్యాలయ సిబ్బంది పాల్గొని మహనీయులకు నివాళులర్పించారు.