తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవ యాత్రకు సంపూర్ణ మద్దతు: మాజీ ఎమ్మెల్యే కంచర్ల
తెలంగాణ బ్రాహ్మణ ఐక్య వేదిక, తెలంగాణ బ్రాహ్మణ ఉద్యమకారుల ఐక్య వేదిక సంయుక్తంగా చేపట్టనున్న “తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవ యాత్ర”కు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి తెలిపారు.
నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆత్మగౌరవ యాత్రకు సంబంధించిన పోస్టర్‌ను కంచర్ల భూపాల్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవం కోసం యాత్ర చేపట్టడం మంచి కార్యక్రమమని అన్నారు.
మహిళా శాసనసభ్యులకు అవమానం జరిగిన అసెంబ్లీ ప్రాంగణం నుంచే ఈ యాత్రను ప్రారంభిస్తే మరింత సముచితంగా ఉంటుందని ఆయన సూచించారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో బ్రాహ్మణులకు ప్రాధాన్యత, గౌరవం లభించిందని కంచర్ల భూపాల్‌రెడ్డి పేర్కొన్నారు. రూ.100 కోట్లతో బ్రాహ్మణ పరిషత్‌ను ఏర్పాటు చేశారని, పేద బ్రాహ్మణ విద్యార్థుల విదేశీ విద్య కోసం రూ.20 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించారని తెలిపారు. ధూపదీప నైవేద్య పథకం కింద అర్చకుల గౌరవ వేతనాలను తొలుత రూ.6 వేల నుంచి అనంతరం రూ.10 వేలకు పెంచారని గుర్తుచేశారు. ఆ సమయంలో బ్రాహ్మణులు సంతోషంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ బ్రాహ్మణ ఐక్య వేదిక, తెలంగాణ బ్రాహ్మణ ఉద్యమకారుల ఐక్య వేదిక సంయుక్తంగా చేపడుతున్న ఆత్మగౌరవ దీక్ష, యాత్రకు తన సంపూర్ణ సహకారం ఉంటుందని కంచర్ల స్పష్టం చేశారు. ఉద్యమాల ఖిల్లా నల్లగొండ గడ్డ నుంచి ఈ యాత్రను ప్రారంభించడం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అన్ని బ్రాహ్మణ సంఘాలు ఐక్యంగా ముందుకు సాగాలని, తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.
తెలంగాణ బ్రాహ్మణ సమైక్య సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు పోచంపల్లి రమణారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ యజ్ఞం పవన్‌కుమార్ శర్మ, దేవులపల్లి రంగారావు, గంప రామశర్మ, కిరణ్‌కుమార్ శర్మ, కంచనపల్లి రవీందర్‌రావు, గుడా జయరావు, గుడా రాజేశ్వరరావు, నారపరాజు రజనీరావు, జ్యోతి కులకర్ణి, చకిలం వేణుగోపాలరావు, కందాల శ్రీనివాసాచార్యులు, పసునూరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.