నల్లగొండలో ఘనంగా కరాటే పోటీలు మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి
నల్లగొండ: నల్లగొండ నగరంలోని డీవీకే రోడ్డులో గల శివాంజనేయ గార్డెన్స్‌లో జేకేఏఐ షోటోకాన్ కరాటే స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం కరాటే పోటీలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథిగా, మాజీ జెడ్పీటీసీ గుమ్మడి మోహన్‌రెడ్డి ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. కరాటే వంటి ఆత్మరక్షణ క్రీడలు పిల్లల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ధైర్యం, శారీరక దారుఢ్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు.
గుమ్మడి మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. క్రీడలు యువతను ఆరోగ్యకరమైన జీవనశైలివైపు నడిపిస్తాయని తెలిపారు. కరాటేలో ప్రతిభ చూపుతున్న క్రీడాకారులు భవిష్యత్‌లో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర పరీక్షకుడు రాపోలు సుదర్శన్ పర్యవేక్షణలో వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. కార్యక్రమంలో క్రీడాకారులు, ప్రజాప్రతినిధులు, క్రీడాభిమానులు, నిర్వాహకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.