🏠 cheekativelugu.com
Watermark
Clip Header Logo
Date of Publish : 27 September 2026, 5:50 pm Posted by : CHEEKATI VELUGU

నల్గొండలో 5వ యునైటెడ్ జిల్లా తైక్వాండో ఛాంపియన్‌షిప్ ఐదు విభాగాల్లో పోటీలు.. 300 మంది క్రీడాకారుల పాల్గొనడం

News Image
నల్గొండ: నల్గొండ పట్టణంలోని విద్యా గ్రామర్ స్కూల్ సమీపంలో 5వ యునైటెడ్ జిల్లా కియోరూగి, పూమ్సే తైక్వాండో ఛాంపియన్‌షిప్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాల నుంచి సుమారు 300 మంది చిన్నారులు, క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.

సబ్‌ జూనియర్, క్యాడెట్, జూనియర్, సీనియర్ తదితర విభాగాల్లో క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు.

తెలంగాణ ఒలింపిక్ సంఘం, తైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు అనుబంధంగా ఉన్న తెలంగాణ తైక్వాండో సంఘం ఆధ్వర్యంలో ఈ ఛాంపియన్‌షిప్‌ నిర్వహిస్తున్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలకు తీర్చిదిద్దడం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్, ఐఏఎస్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. క్రీడల ద్వారా యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వం పెంపొందుతాయని ఆయన పేర్కొననున్నారు.

తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఏ. ప్రవీణ్ కుమార్, నల్గొండ జిల్లా తైక్వాండో సంఘం అధ్యక్షుడు ఎం.డి. యూనస్ కమాల్ ఆధ్వర్యంలో పోటీలు కొనసాగనున్నాయి. జిల్లా యువజన క్రీడల అధికారి ఎం.డి. అక్బర్ అలీ, సీనియర్ కోచ్‌లు, సాంకేతిక అధికారులు పాల్గొననున్నారు.
🏠 Home