🏠 cheekativelugu.com
Watermark
Clip Header Logo
Date of Publish : 27 September 2026, 5:49 pm Posted by : CHEEKATI VELUGU

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను భావితరాలకు అందించాలి జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్

News Image
నల్గొండ: నీతి, నిజాయితీతో ముక్కుసూటిగా వ్యవహరిస్తూ న్యాయం, ధర్మం కోసం పోరాడిన గొప్ప ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.

కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి సందర్భంగా నల్గొండలోని హైదరాబాద్ రోడ్డులో పాల కేంద్రం వద్ద ఉన్న ఆయన విగ్రహానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్య ఉద్యమంతో పాటు తెలంగాణ ఉద్యమంలోనూ బాపూజీ కీలక పాత్ర పోషించారని తెలిపారు.

ప్రజా సమస్యలపై పోరాడిన ఆయన సేవలు, ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చూపిన న్యాయం, ధర్మం మార్గంలో నడుస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి సభ్యుడు శంకర్ నాయక్, అధికారులు, ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
🏠 Home