🏠 cheekativelugu.com
Watermark
Clip Header Logo
Date of Publish : 24 September 2026, 4:27 pm Posted by : CHEEKATI VELUGU

అమృత ప్రణయ్ హత్య కేసులో A4 అబ్దుల్ బారీ మృతి!

News Image
మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన అమృత ప్రణయ్ హత్య కేసులో A4 నిందితుడిగా జీవిత ఖైదు అనుభవిస్తున్న అబ్దుల్ బారీ మృతి చెందినట్లు సమాచారం.

చర్లపల్లి జైలులో గుండె నొప్పితో అస్వస్థతకు గురైన బారీని జైలు సిబ్బంది గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రిలో ఉంచారు. మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
🏠 Home