బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే - జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి పట్టణంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జాగృతి శ్రేణులతో కలిసి రైల్ రోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 17 శాతం రిజర్వేషన్లతోనే పంచాయతీ ఎన్నికలను నిర్వహించడం దారుణం అని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా కాంగ్రెస్, బీజేపీలు కుట్రలు చేస్తున్నాయని అన్నారు.