చెరువు లీజుతో అక్రమాలా..?
శాలిగౌరారం మత్స్యకారుల ప్రశ్న..
రమణ ముదిరాజ్‌పై కుట్రపూరిత ప్రచారాన్ని ఖండించిన సభ్యులు
చీకటి వెలుగునల్లగొండ, సెప్టెంబర్ 12:
శాలిగౌరారం పెద్ద చెరువు లీజు వ్యవహారంలో అక్రమాలు, నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నాయని ప్రశ్నించిన తమ నాయకుడు ఎల్‌వీ రమణ ముదిరాజ్‌పై కొంతమంది కుట్రపూరితంగా ప్రచారం చేయడాన్ని శాలిగౌరారం మత్స్యకార సొసైటీ సభ్యులు తీవ్రంగా ఖండించారు.శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు, మత్స్యశాఖ బైలా నిబంధనలకు విరుద్ధంగా చెరువును బయటి వ్యక్తులకు లీజుకు అప్పగించి దళారులు లబ్ధి పొందుతున్నారని వారు ఆరోపించారు. దీనిపై రమణ ముదిరాజ్ ప్రశ్నించడంతో ఆయనపై లేనిపోని ఫిర్యాదులు చేయడం సరికాదన్నారు.చెరువులను బయటి వ్యక్తులు, దళారులకు లీజుకు ఇవ్వడం వల్ల అసలైన మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేపల విక్రయం ద్వారా వచ్చే అసలు లాభాలు సొసైటీ సభ్యులకు దక్కకుండా, నామమాత్రపు కూలీ మాత్రమే లభిస్తోందని ఆరోపించారు.లీజుకు ఇస్తున్నట్లు పాలకవర్గ కమిటీ సభ్యులు మాట్లాడిన వీడియో ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు.ఆధారాలు బయటపెడితే వాస్తవాలు తేలిపోతాయని పేర్కొన్నారు.బాధ్యతాయుత పదవిలో ఉన్న వ్యక్తి ఇలా వ్యవహరించడం సమంజసం కాదన్నారు.అక్రమ లీజుల వ్యవహారాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.సమస్య పరిష్కారం కాకపోతే రమణ ముదిరాజ్ ఆధ్వర్యంలో సుమారు 250 మంది సొసైటీ సభ్యులు, వారి కుటుంబ సభ్యులతో కలిపి 500 మందికి పైగా నల్లగొండ కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో పడాల వెంకన్న, నూతి సత్యనారాయణ, పడాల నారాయణ, బోళ్ల నాగరాజు, పడాల రవి, గంధసిరి సత్యనారాయణ, వాడపల్లి శివరాజ్,