🏠 cheekativelugu.com
Watermark
Clip Header Logo
Date of Publish : 20 December 2025, 5:43 pm Posted by : CHEEKATI VELUGU

నల్గొండ ప్రీమియర్ లీగ్ సీజన్–6 విజేత డీకే వారియర్స్

News Image

నల్గొండలో నిర్వహించిన నల్గొండ ప్రీమియర్ లీగ్ (ఎన్‌పీఎల్) సీజన్–6 క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో డీకే వారియర్స్ జట్టు విజేతగా నిలిచి ట్రోఫీని సొంతం చేసుకోగా, అడా సీసీ జట్టు రన్నరప్‌గా నిలిచింది.








ఈ ఫైనల్ మ్యాచ్‌కు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజేతగా నిలిచిన డీకే వారియర్స్ జట్టుకు ట్రోఫీతో పాటు బహుమతులు అందజేయగా, రన్నరప్‌గా నిలిచిన అడా సీసీ జట్టుకు కూడా బహుమతులు అందజేశారు. అనంతరం రెండు జట్ల క్రీడాకారులను ఆయన అభినందించారు.




ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, క్రీడాభిమానులు, స్థానిక యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నల్గొండ జిల్లాలో యువ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడంలో ఎన్‌పీఎల్ సీజన్–6 కీలక వేదికగా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు.

🏠 Home