జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఊపు
జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రహమత్ నగర్ డివిజన్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు.
గడప గడపకు తిరుగుతూ ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ,
హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు.
ఈ ప్రచారంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వం విప్ బీర్ల ఐలయ్య, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు:
“పేదల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం నిజంగా పని చేసే పార్టీ కాంగ్రెస్ మాత్రమే.
బస్తీల్లో పేదల భవిష్యత్తు మెరుగుపడాలంటే,
జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని ఘన విజయంలో నిలబెట్టాలి” అని పిలుపునిచ్చారు.