మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ
కంది ఉల్లాస్, చీకటి వెలుగు:
హైదరాబాద్, అక్టోబర్ 31:
రాష్ట్ర మంత్రుల నివాస సముదాయంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిను ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న సామాజిక న్యాయం, వర్గాల సమాన హక్కులు, మరియు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై చర్చించారు.
మంద కృష్ణ మాదిగ గారు సమాజ అభివృద్ధికి దోహదపడే విధంగా మరిన్ని చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరగా, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు సమాజంలోని ప్రతి వర్గం అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.