🏠 cheekativelugu.com
Watermark
Clip Header Logo
Date of Publish : 06 July 2026, 8:25 pm Posted by : CHEEKATI VELUGU

గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో భారత పాస్‌పోర్ట్ ర్యాంక్ పడిపోయింది

News Image

గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్-2026లో భారత పాస్‌పోర్ట్ ర్యాంక్ ఒక స్థానం పడిపోయి 125వ స్థానానికి చేరుకుంది. గత ఏడాది భారత్ 124వ స్థానంలో ఉండగా, ఈసారి టాప్-100 వెలుపలే కొనసాగుతోంది.




తాజా నివేదిక ప్రకారం, భారత పాస్‌పోర్ట్ కలిగిన వారు ప్రస్తుతం 26 దేశాలకు వీసా లేకుండానే ప్రయాణించగలుగుతున్నారు. అంతర్జాతీయ ప్రయాణ స్వేచ్ఛ పరంగా భారత్ ఇంకా పరిమిత అవకాశాలే కలిగి ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.  




గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్ పాస్‌పోర్ట్ బలం, అంతర్జాతీయ ప్రయాణ సౌలభ్యం, వీసా-రహిత ప్రవేశం వంటి అంశాల ఆధారంగా దేశాలకు ర్యాంకులు కేటాయిస్తుంది. ఈ ఏడాది కూడా యూరప్‌కు చెందిన పలు దేశాలు అగ్రస్థానాల్లో నిలిచాయి. 

🏠 Home