🏠 cheekativelugu.com
Watermark
Clip Header Logo
Date of Publish : 14 June 2026, 8:27 pm Posted by : CHEEKATI VELUGU

సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి

News Image

వరంగల్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు.




రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా స్థాయి, రెవెన్యూ డివిజన్ స్థాయిల్లో ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.




జిల్లా స్థాయి సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయి ప్రజావాణి, డివిజన్ పరిధిలోని సమస్యల పరిష్కారానికి డివిజన్ స్థాయి ప్రజావాణి నిర్వహించబడుతుందని తెలిపారు.




ప్రజలు తమ సమస్యలు, వినతులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందేందుకు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.




ఈ కార్యక్రమానికి జిల్లా స్థాయి అధికారులు హాజరై ప్రజల సమస్యలను స్వీకరించి పరిష్కారానికి చర్యలు చేపడతారని కలెక్టర్ తెలిపారు.

🏠 Home