నేడు ప్రపంచ హైపర్‌టెన్షన్ దినోత్సవం
అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్)పై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రపంచవ్యాప్తంగా నేడు వరల్డ్ హైపర్‌టెన్షన్ డే నిర్వహిస్తున్నారు.
హైబీపీకి సాధారణంగా ఎలాంటి హెచ్చరిక లక్షణాలు కనిపించకపోయినా, ఇది గుండెజబ్బులు, స్ట్రోక్, చూపు కోల్పోవడం, డిమెన్షియా వంటి ప్రమాదాలకు దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ ఏడాది థీమ్ “Controlling Hypertension Together: Check your blood pressure regularly, defeat the silent killer” గా నిర్ణయించారు.
నియమిత రక్తపోటు పరీక్షలు, సమయానికి గుర్తింపు, సరైన చికిత్స మరియు ఫాలోఅప్ ద్వారా లక్షలాది మంది ప్రాణాలను కాపాడవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
హైపర్‌టెన్షన్ అవగాహన నెలలో భాగంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నారు.