GHMC ఉద్యోగి ఏసీబీ వలలో.. రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబాటు
హైదరాబాద్‌లో అవినీతి మరోసారి బయటపడింది. బోరబండలోని GHMC కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శ్రీలత రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కింది.
ఇంటి నిర్మాణ అనుమతి ఫైల్ క్లియర్ చేసేందుకు మొత్తం రూ.5 లక్షలు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అందులో భాగంగా రూ.లక్ష తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ట్రాప్ నిర్వహించి రంగేచేత పట్టుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.