కార్మిక హక్కుల కోసం కాంగ్రెస్ కృషి
నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో INTUC మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే ఉత్సవాల్లో మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె జెండా ఆవిష్కరించి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు.
మాట్లాడుతూ, శ్రమజీవుల పోరాట ఫలితమే మేడే అని పేర్కొంటూ, కార్మికులు ఎన్నో పోరాటాల ద్వారా తమ హక్కులను సాధించుకున్నారని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తోందని ఆవేదన వ్యక్తం చేసిన ఆమె, నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ, కార్పొరేటర్లు, INTUC నాయకులు మరియు కార్మికులు పాల్గొన్నారు.