🏠 cheekativelugu.com
Watermark
Clip Header Logo
Date of Publish : 28 April 2026, 5:26 pm Posted by : CHEEKATI VELUGU

యుద్ధాలతో ప్రపంచానికి ముప్పు: రాఘవులు… ఇరాన్‌పై యుద్ధం శాంతికి విఘాతం

News Image

నల్లగొండలో నిర్వహించిన సెమినార్‌లో సిపిఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యుడు బి.వి. రాఘవులు మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు మానవాళికి ప్రత్యక్ష, పరోక్ష ముప్పు అని పేర్కొన్నారు.




“ఇరాన్‌పై ఇజ్రాయిల్–అమెరికా యుద్ధం ప్రపంచ శాంతికి విఘాతం” అనే అంశంపై ఉపాధ్యాయ సంఘాలు, సిఐటియు, పీపుల్స్ ప్రోగ్రెస్ ఫోరం ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.




ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ, చమురు ఆధిపత్యం కోసం అమెరికా యుద్ధాలు కొనసాగిస్తున్నదని, ఈ యుద్ధాల వల్ల ప్రపంచ ఆర్థిక పరిస్థితులు దెబ్బతింటున్నాయని అన్నారు.




భారత్ సహా అనేక దేశాల్లో గ్యాస్, పెట్రోల్, డీజిల్, ఎరువుల కొరత ఏర్పడే పరిస్థితులు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.




రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ, యుద్ధాల వల్ల ప్రపంచానికి నష్టం జరుగుతుందని, శాంతి కోసం అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.




ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

🏠 Home