పసునూరి శ్రీనివాస్‌కు ఘన నివాళులు… మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరు
స్వర్ణకారుల సంఘం నాయకుడు పసునూరి శ్రీనివాస్ అనారోగ్యంతో మరణించడంతో ఆయన దశదిన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరై శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
పసునూరి జయశంకర్ కుమారుడైన శ్రీనివాస్ సేవలను ఈ సందర్భంగా పలువురు స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా స్వర్ణకారుల సంఘం నాయకులు, జిల్లా అధ్యక్షుడు రాచకొండ గిరి, కొల్లోజు సత్యనారాయణతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు.