రూ.30 వేల లంచం తీసుకుంటూ ఏడీఈ పట్టుబాటు
విద్యుత్ కాంట్రాక్టర్ నుంచి రూ.30 వేల లంచం తీసుకుంటూ ఏడీఈ సైదులు ఏసీబీ అధికారుల వలలో చిక్కారు.
పని క్లియర్ చేయడానికి లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు ట్రాప్ నిర్వహించారు.
దాడుల సమయంలో సైదులు లంచం తీసుకుంటుండగా రంగేచేత పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.