డీజిల్ ఎగుమతి సుంకం భారీ పెంపు
కేంద్ర ప్రభుత్వం డీజిల్ మరియు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF)పై ఎగుమతి సుంకాలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, డీజిల్‌పై ఎగుమతి సుంకాన్ని లీటర్‌కు రూ.21.5 నుంచి రూ.55.5కు పెంచారు.
అలాగే విమాన ఇంధనం (ATF)పై ఎగుమతి సుంకాన్ని లీటర్‌కు రూ.29.5 నుంచి రూ.42కు పెంచారు.
అయితే పెట్రోల్‌పై ఎగుమతి సుంకాన్ని యథాతథంగా నిలిపి, ఎటువంటి మార్పులు చేయలేదు.
ఈ నిర్ణయం అంతర్జాతీయ ఇంధన మార్కెట్ పరిస్థితులు, దేశీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్నట్లు సమాచారం.