🏠 cheekativelugu.com
Watermark
Clip Header Logo
Date of Publish : 05 April 2026, 5:59 pm Posted by : CHEEKATI VELUGU

విగ్రహాలను తొలగించొద్దని వినతి… కలెక్టర్‌కు కమిటీ ప్రతినిధుల అభ్యర్థన

News Image

నల్లగొండలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను తొలగించొద్దని పరిరక్షణ కమిటీ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసింది.




డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ – బాబు జగ్జీవన్ రామ్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో 119వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్‌కు కమిటీ ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు.




రోడ్డు అభివృద్ధి పనుల భాగంగా విగ్రహాలను తొలగించే చర్యలు చేపట్టకూడదని, వాటిని పరిరక్షించాలని వారు కోరారు.




అనంతరం బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.




ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు కత్తుల సహదేవ్, ప్రధాన కార్యదర్శి బొజ్జ నాగయ్య, కార్పొరేటర్ బొజ్జ శంకర్, గుమ్ముల జానకి మోహన్ రెడ్డి, బిపంగి యాదయ్య, బొజ్జ వెంకన్న, బొజ్జ గోపి తదితరులు పాల్గొన్నారు.

🏠 Home