🏠 cheekativelugu.com
Watermark
Clip Header Logo
Date of Publish : 23 March 2026, 4:03 pm Posted by : CHEEKATI VELUGU

న్యూయార్క్ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం

News Image

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. లాగార్డియా విమానాశ్రయంలో ఎయిర్ కెనడా విమానం ఒక ఫైర్ ఫైటింగ్ వాహనాన్ని ఢీకొట్టింది.




ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.




ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. విమానం రన్‌వేపై కదులుతున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక సమాచారం.




ఈ ఘటనతో విమానాశ్రయంలో కొంతసేపు ఆందోళన నెలకొంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా అధికారులు తక్షణ చర్యలు తీసుకున్నారు.

🏠 Home