🏠 cheekativelugu.com
Watermark
Clip Header Logo
Date of Publish : 09 March 2026, 2:55 pm Posted by : CHEEKATI VELUGU

మరణానంతరం నేత్రదానం చేసిన కొమురమ్మ

News Image

వరంగల్ జిల్లా గీసుగొండ మండలం వంచనగిరి గ్రామానికి చెందిన అమిరిశెట్టి కొమురమ్మ (65) సోమవారం (09-03-2026) గుండెపోటుతో హఠాత్తుగా మృతిచెందారు.




కొమురమ్మ మరణానంతరం ఆమె కుటుంబ సభ్యులు గొప్ప నిర్ణయం తీసుకుని ఎల్.వి. ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు నేత్రదానం చేశారు. దీంతో ఇద్దరు అంధులకు వెలుగు అందే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.




గ్రామస్థులు మరియు స్థానికులు ఈ కుటుంబం చేసిన సేవను అభినందించారు. సమాజంలో నేత్రదానం ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ ఈ ఘటన మానవతా సందేశాన్ని అందించింది.




మృతురాలికి భర్త నాదం, కుమారులు మధు, ప్రతాప్, కూతురు సుహాసిని ఉన్నారు. కొమురమ్మ మృతితో కుటుంబ సభ్యులు మరియు గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.





🏠 Home