ఆడంబరాలకు దూరంగా ఐఏఎస్–ఐపీఎస్ అధికారుల ఆదర్శ వివాహం
యాదాద్రి భువనగిరి జిల్లా:
ఆడంబరాలు, భారీ ఖర్చులకు దూరంగా ఉండి సమాజానికి ఆదర్శంగా నిలిచే విధంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వివాహం చేసుకున్నారు.
చౌటుప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎలాంటి హంగులు లేకుండా రిజిస్టర్ వివాహం జరుపుకున్నారు. చౌటుప్పల్ మండలం లింగారెడ్డిగూడెంకి చెందిన యువ ఐపీఎస్ అధికారి శేషాద్రిని రెడ్డిని, కడప జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ రెడ్డి వివాహం చేసుకున్నారు.
ప్రస్తుతం శేషాద్రిని రెడ్డి కుత్బుల్లాపూర్ డీసీపీగా విధులు నిర్వహిస్తుండగా, శ్రీకాంత్ రెడ్డి ఐఏఎస్ ట్రైనింగ్‌లో ఉన్నారు. ఈ సాదాసీదా వివాహానికి పలువురు ఉన్నతాధికారులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
అధికారులు అయినప్పటికీ ఆడంబరాలకు దూరంగా, సింపుల్‌గా వివాహం జరుపుకోవడం పట్ల పలువురు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.