🏠 cheekativelugu.com
Watermark
Clip Header Logo
Date of Publish : 24 January 2026, 9:54 am Posted by : CHEEKATI VELUGU

నల్లగొండ జిల్లాలో నిరుద్యోగ యువతకు బిగ్ ఛాన్స్.. గ్రూప్స్, బ్యాంకింగ్, SSC పరీక్షలకు ఉచిత శిక్షణ

News Image

నల్లగొండ | విద్యా వార్తలు:




తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా నల్లగొండ జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ అందించేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. గ్రూప్–I, గ్రూప్–II, గ్రూప్–III, గ్రూప్–IV, బ్యాంకింగ్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) మరియు RRB పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఈ కోచింగ్ నిర్వహించనున్నారు.




అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. కోచింగ్ పూర్తిగా ఉచితం కాగా, ఎంపికైన అభ్యర్థులకు నాణ్యమైన బోధనతో పాటు రెసిడెన్షియల్ సౌకర్యాలు కూడా కల్పించనున్నట్లు తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు జనవరి 30, 2026 చివరి తేదీగా నిర్ణయించారు.




ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అర్హత కలిగిన యువత ముందుకు రావాలని జిల్లా అధికారులు కోరారు.





🏠 Home