🏠 cheekativelugu.com
Watermark
Clip Header Logo
Date of Publish : 14 January 2026, 12:45 pm Posted by : CHEEKATI VELUGU

కర్ణాటక రాజకీయాల్లో హీట్.. ఢిల్లీకి సిద్ధరామయ్య?

News Image

బెంగళూరు:




కర్ణాటక రాజకీయాల్లో ఊహించని మలుపు చోటుచేసుకుంది. సీఎం పదవి అంశం చుట్టూ జరుగుతున్న చర్చల మధ్య సీఎం సిద్ధరామయ్య కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీకి సిద్ధరామయ్య ప్లాన్ చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.




పార్టీలో అంతర్గత పరిణామాలు, నేతల మధ్య విభేదాల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. రాహుల్ గాంధీతో భేటీలో తాజా రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పనితీరు, భవిష్యత్ వ్యూహాలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం.




ఈ భేటీ అనంతరం కర్ణాటక రాజకీయాల్లో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ లోపలి సమీకరణాలు ఎలా మారతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

🏠 Home