🏠 cheekativelugu.com
Watermark
Clip Header Logo
Date of Publish : 18 November 2025, 7:06 am Posted by : CHEEKATI VELUGU

తిరుమల శ్రీవారికి ₹4.5 కోట్లు విలువైన యజ్ఞోపవీతం – హైదరాబాద్ భక్తుడి అరుదైన కానుక

News Image

తిరుమల, నవంబర్ 17, 2025:




తిరుమల శ్రీవారికి ఒక భక్తుడు నాలుగున్నర కోట్ల రూపాయల విలువైన విలక్షణ యజ్ఞోపవీతాన్ని సమర్పించడంతెలుగులో విశేష చర్చనీయాంశమైంది. హైదరాబాద్‌కు చెందిన నిలోఫర్ టీ దుకాణం యజమాని మరియు వైశ్య ప్రముఖుడు నీలాపూర్ బాబూరావు ఈ అత్యంత విలువైన కానుకను భక్తి పరవశంతో శ్రీవారికి సమర్పించారు.




💎 వజ్రాలతో అలంకరించిన ప్రత్యేక యజ్ఞోపవీతం




ఈ యజ్ఞోపవీతం పూర్తిగా అతి విలువైన వజ్రాలు మరియు బంగారంతో రూపొందించబడింది. నిపుణుల కళాకారులతో ప్రత్యేకంగా తయారు చేయించగా, ఖర్చు సుమారు ₹4.5 కోట్లు వచ్చినట్లు తెలిసింది. ఇది శ్రీవారి సేవలకు అంకితం చేసేందుకు ప్రత్యేక రీతిలో తయారుచేయబడింది.




🗣️ భక్తుడు బాబురావు భావోద్వేగ వ్యాఖ్యలు




యజ్ఞోపవీతం సమర్పించిన అనంతరం బాబురావు భావోద్వేగంతో మాట్లాడుతూ—





“గత నెలలో శ్రీవారి దర్శనానికి వచ్చాను. ఆ సమయంలో యజ్ఞోపవీతం తెస్తావా అన్నట్టుగా అనిపించింది. ఆ భావన వెంటాడడంతో నెల రోజుల్లోనే వజ్రాలతో చేయించి తీసుకు వచ్చాను. ఇది నా జీవితంలో పెద్ద అదృష్టం.”





అని తెలిపారు.




🙏 టీటీడీ అధికారులు ప్రశంసలు




టీటీడీ అధికారులు భక్తుడి సేవాభావాన్ని అభినందించారు.




ఈ యజ్ఞోపవీతాన్ని శ్రీవారి సేవలో ప్రత్యేక సందర్భంగా ఆపాదించనున్నట్టు సమాచారం.

🏠 Home